74శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కాకతీయ గనుల్లో 74 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. గడిచిన డిసెంబర్ మాసంలో 5.42 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 4.02 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి 74శాతంలో నిలిచినట్లు తెలిపారు. వెలికితీసిన బొగ్గులో 2.35లక్షల టన్నులను రవాణా చేశామన్నారు. ఓసీ–2లో 96శాతం, ఓసీ–3లో 63 శాతం మట్టి వెలికితీత పనులు చేశామన్నారు. ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ఉద్యోగులందరు సమష్టిగా కృషి చేయాలన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. భారీ యంత్రాలు, ఎస్‌డీఎల్ యంత్రాల పని గంటలను పెంచడానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, రక్షణ విషయంలో రాజీపడేది లేదన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జీఎం రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment