బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
చిట్యాల/భూపాలపల్లి రూరల్: మండలంలోని నైన్‌పాక గ్రామంలోని నాపాక సర్వతోభద్ర ఆలయ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మహాజాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదండ్ల రాజయ్య తెలిపారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చెలుకూరి రాజయ్య, తోట్ల ఎర్రయ్య, ముద్దంగుల అయిలయ్య, కాశిపాక కమల, నాయకులు భాస్కర్, రాయకోంరు, తిరుపతిగౌడ్, శంకర్, రాములు, రవి, కొంరయ్య, రఘుపతి, మధు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు 2025 సంవత్సరం అందరికీ ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment