మండలాలకు ప్రత్యేక అధికారులు | - | Sakshi
Sakshi News home page

మండలాలకు ప్రత్యేక అధికారులు

Published Thu, Jan 16 2025 8:14 AM | Last Updated on Thu, Jan 16 2025 8:14 AM

మండలా

మండలాలకు ప్రత్యేక అధికారులు

భూపాలపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి మండల ప్రత్యేక అధికా రిగా వి.నారాయణరావు(డీపీఓ), చిట్యాలకు కె.చిన్నయ్య(డీడబ్ల్యూఓ), గణపురం మండలా నికి కుమారస్వామి(డీవీఏహెచ్‌ఓ), కాటారం మండలానికి పి.నరేష్‌(డీఆర్‌డీఓ), మల్హర్‌కు ఆర్‌.అవినాష్‌(డీఎఫ్‌ఓ), మహదేవ్‌పూర్‌కు ఎం.వీరభద్రయ్య(డీఎల్‌పీఓ), మహాముత్తారానికి ఎ.వెంకటేశ్వర్లు(ఈడీఎస్సీ), మొగుళ్లపల్లికి డి.సునీత(డీఎస్సీడీఓ), రేగొండకు ఎ.సునీల్‌(హార్టికల్చర్‌ ఆఫీసర్‌), పలిమెలకు ఎం.విజయభాస్కర్‌(డీఏఓ), టేకుమట్ల మండల ప్రత్యేక అధికారిగా టి.శైలజ(డీబీసీడీఓ)ను నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: కోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాజమానులు స్పందించి లారీ ఓనర్ల సమస్యలను పరిష్కరించాలని సీనియర్‌ లారీ ఓనర్‌ తుమ్మేటి రాంరెడ్డి ప్రకటనలో కోరారు. లారీల కిరాయిలు పెంచాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం, ట్రాన్స్‌పోర్టర్లు స్పందించడం లేదని తెలిపారు. లారీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4వేల మంది ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. సమ్మె వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

కాసీంపల్లి వాసికి అవార్డు

భూపాలపల్లి రూరల్‌: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వైభవం, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు పరిరక్షణకు కృషిచేస్తూ కవితలు, పాటలు, కథలు రాస్తున్న యువ రచయితకు అవార్డు దక్కింది. భూపాలపల్లి మున్సిపాలిటీ కాసీంపల్లికి చెందిన బేతు సునీల్‌ యాదవ్‌ జాతీయ యువ తేజం పురస్కారానికి ఎంపికై నట్లు శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ బుధవారం ప్రకటనలో తెలిపారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే సాహితీ సంబురాల్లో సునీల్‌ యాదవ్‌ ఈ అవార్డు అందుకోనున్నారు. ఇదిలా ఉండగా.. తను రాసిన పుస్తకాలు మట్టిచిప్ప, తునికాకు త్వరలో ప్రచురించనున్నట్లు సునీల్‌ యాదవ్‌ తెలిపారు.

20న జరిగే కేయూ

దూరవిద్య పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యకు సంబంధించి ఈనెల 20న జరగాల్సిన పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌(నాల్గవ పేపర్‌ ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, జూవాలజీ, మ్యాథ్‌మెటిక్స్‌) పరీక్షలు ఈనెల 24వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆరోజు టీజీటెట్‌ పరీక్ష ఉన్నందున తేదీ మార్చినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

సోలార్‌ ప్లాంట్ల కోసం

దరఖాస్తు చేసుకోవాలి

ఏటూరునాగారం: ములుగు, జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాలోని పోడు భూముల హక్కు పత్రాలను కలిగిన గిరిజన రైతులు సోలార్‌ ప్లాంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీ ఏ పీఓ చిత్రామిశ్ర బుధవారం అన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్ష పవం ఉత్తమ్‌ మహాబియాన్‌ (పీఎం కుసుమ్‌) పథకం ద్వారా సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సహం కలిగిన గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పీఓ తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు వల్ల కౌలు రైతులకు ఆదా యం వస్తుందన్నారు. అర్హులైన రైతులు ఈనెల 19లోపు ఐటీడీఏ, డీడీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

కోటలో పర్యాటకుల సందడి

ఖిలా వరంగల్‌: సంక్రాంతి, కనుమ పండుగ నేపథ్యంలో బుధవారం కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌ కోటకు భారీగా సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. సనాతన్‌ ధర్మ కాలేజీ, న్యూఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర జిల్లాలతోపాటు నగర ప్రజలు కోటను సందర్శించారు. మధ్యకోట శిల్పాల ప్రాంగణం సందడిగా మారింది. శిల్ప సంపద, ఖుష్‌మహల్‌, ఏకశిల గుట్ట, రాతి మట్టికోట అందాలను తిలకించారు. కాకతీయుల విశిష్టత, నిర్మాణ శైలిని కోట గైడ్‌ రవియాదవ్‌ పర్యాటకులకు వివరించారు. అనంతరం టీజీ టీడీసీ ఆధ్వర్యాన నిర్వహించిన సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షో వీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మండలాలకు  ప్రత్యేక అధికారులు
1
1/1

మండలాలకు ప్రత్యేక అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement