సంబురంగా సంక్రాంతి
కన్యకాపరమేశ్వరీ ఆలయంలో లక్ష పసుపుకొమ్ముల నోములో పాల్గొన్న వైశ్యులు
భూపాలపల్లి అర్బన్: చూడముచ్చటైన రంగవల్లులు.. వాటి మధ్య అలంకరించిన గొబ్బెమ్మలు.. హరిదాసుల గీతాలాపనలు.. పిల్లలు, యువకుల గాలిపటాల ఆటలు.. పిండివంటల ఘుమఘుమలు.. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రజలు మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాల్లో మహిళలు సంప్రదాయ బద్దంగా నోములు నోముకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు ముంగిళ్లలో సంప్రదాయమైన ముగ్గులను వేసి రంగులతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఆర్యవైశ్యులు లక్ష పసుపుగొమ్ములతో పంచవతి నోములు నిర్వహించారు. ముగ్గుల పోటీలతో మహిళలు, క్రీడాపోటీలు, కోడిపందేలతో యువకులు హోరెత్తించారు.
జోరుగా పతంగుల ఎగురవేత
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment