లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశపు హాల్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి విచారణ, గ్రామసభలు నిర్వహణపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, డీఆర్డీఓ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో విచారణ, గ్రామసభలు నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి, లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేయాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో 16 నుంచి 20వ తేది వరకు క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించే విధంగా షెడ్యూల్ తయారు చేసినట్లు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయి విచారణ, గ్రామసభల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment