మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
భూపాలపల్లి అర్బన్: మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా రవాణాశాఖ అధికారి మహ్మద్ సంధాని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏరియాలోని కేటీకే ఓసీ–2లోని కార్మికులకు గురువారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వలన ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అతివేగం, ఓవర్ టేకింగ్, మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ వినియోగించకుండా, సీట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రోడ్డుపై నడిచే ప్రతి వ్యక్తి బాధ్యతగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓసీ–2 మేనేజర్ కృష్ణప్రసాద్, అధికారులు సుందర్‌లాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment