అయోధ్య రామయంత్రం రథానికి ఘన స్వాగతం
జోగుళాంబ శక్తిపీఠం/ఎర్రవల్లి: అయోధ్యలో ప్రతిష్ఠించనున్న శ్రీరామయంత్రం మంగళవా రం అలంపూర్ జోగుళాంబ క్షేత్రానికి చేరుకుంది. శ్రీరామయంత్రం రథానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, స్థానిక ఆర్యవైశ్య భక్తులు ఘన స్వాగతం పలికారు. కంచీ పీఠం నుంచి అయోధ్యకు తరలిస్తున్న ఐదు శతాబ్దాల క్రితం నాటి శ్రీరామ యంత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీచుపల్లి పుణ్యక్షేత్రానికి శ్రీరామయంత్రం చేరుకోగా.. ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీచారి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్‌గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, జగదీష్‌రెడ్డి, మల్లేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల దిగువ, ఎ గువ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. మంగళవారం 9 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ సూరిబాబు తెలిపారు. ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 324.716 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 309.255 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 633.971 మి.యూ. విద్యుదుత్పత్తి సాధించామని.. ఇందుకు 31 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment