కనులపండువగా భవాని మాత రథోత్సవం
గట్టులో భవాని మాత
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
గట్టు: గట్టులో కొలువుదీరిన అంబాభవాని మాత బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. భక్త జనసంద్రం మధ్య భవాని మాత అమ్మవారి రథోత్సవాన్ని బుధవారం అర్థరాత్రి నిర్వహించారు. రథాన్ని భక్తులు భక్తీ పారవశ్యంతో ముందుకు లాగారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి మహారాష్ట్రలోని ముంబాయి, షోలాపుర్, కొల్హాపుర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కొడుమూర్, గుడూర్, నంద్యాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల ప్రాంతాల నుంచి క్షత్రియ కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో సంత బజారులోని ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన రథంపై అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. భవానిమాత ఆలయం నుంచి చావిడి దగ్గరున్న లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. ప్రత్యేకంగా బాణా సంచా కాల్చారు. ఆలయంలో రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి రథోత్సవాన్ని నిర్వహించారు. ఎస్‌ఐలు మల్లేష్, నందికర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌కే సమాజ్ అధ్యక్షుడు పెద్ద అంబుసా, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, గోవిందు, ఈరన్న,చంద్రమోహన్,వినోద్, లక్ష్మణ్, వినోద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment