భక్తిని చాటుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు
గట్టుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చాపత్తి ఎల్లమ్మ ఉపాధి కోసం కుటుంబంతో బెంగళూరుకు వెళ్లి అక్కడే స్థిర పడింది. అయితే, ప్రతి ఏటా గట్టులో నిర్వహించే అంబాభవాని మాత ఉత్సవాలకు ఆమె బెంగళూరు నుంచి రావడంతోపాటు వేల రూపాయలు వెచ్చించి అక్కడి నుంచి పూలను తీసుకువచ్చి భక్తిని చాటుకుంటుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉత్సవాలకు బెంగళూరు నుంచి రాయచూరుకు అక్కడి నుంచి గట్టుకు సుమారు రూ.60 వేల విలువ చేసే వివిధ రకాలను పూలను వృద్ధురాలు తీసుకురాగా, వాటిని గర్భగుడితో పాటుగా రథానికి అలంకరించారు. అనంతరం ఎల్లమ్మను ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment