రైస్‌మిల్లర్ల మరో సమస్య
రైతుల పరిస్థితి ఇలా ఉంటే రైస్ మిల్లర్లది మరో సమస్య. జిల్లా వ్యాప్తంగా మొత్తం 62రైస్‌మిల్లులు ఉండగా, ఇందులో 34 రైస్‌మిల్లులపై ఎలాంటి జరిమానాలు లేవు. మిగిలిన రైస్‌మిల్లర్లు గతంలో తీసుకున్న ధాన్యం వంద శాతం ప్రభుత్వానికి అప్పజెప్పకపోవడం, 11 రైస్‌మిల్లులు డిఫాల్ట్ లిస్టులో ఉండడం వంటి సమస్యలున్నాయి. తాజాగా ప్రభుత్వం విధించిన నూతన నిబంధనలు రైస్‌మిల్లర్లకు కొత్తచిక్కులు తెచ్చిపెట్టాయి. గతంలో ప్రభుత్వ ధాన్యాన్ని బొక్కేసి రూ.కోట్లలో ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టిన రైస్‌మిల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకునే ధాన్యానికి సరిపడా బ్యాంకు నగదు గ్యారెంటీ, అండర్‌టేకింగ్ పూచికత్తు వంటి నిబంధనలు విధించింది. ఈ నిబంధనల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 12మంది రైస్‌మిల్లర్లే పూచికత్తు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా కొనుగోలు ప్రక్రియలో నెలకొన్న సమస్యలు అదిగమించి రైతులకు మద్దతు ధర కల్పించడంలో అధికారులు ఎంతమే సఫలీకృతం అవుతారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment