వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో కొల్లాపూర్‌కు చెందిన కీలకనేత హవా నడుస్తుండగా.. నారాయణపేటపై కొడంగల్ ముద్ర కొనసాగుతున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. జిల్లాలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఓ నేత బంధువు చెప్పినట్లే జరుగుతున్నాయని సమాచారం. కొడంగల్–నారాయణపేట–మక్తల్ స్కీంకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్‌లలో ఎవరూ చేయి పెట్టొద్దని స్థానిక నాయకులకు సదరు నేత తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. కాగా, బదిలీలు, పోస్టింగ్‌లు, పైరవీలకు సంబంధించి కీలకనేతలతో పాటు స్థానిక నాయకులు సిఫార్సు చేస్తుండడం అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment