భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలాక్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రాలేని భక్తులు శనివారం ఆలయానికి పెద్దసంఖ్యలో చేరుకుని స్వామి వారికి దాసంగాలు, నైవేద్యాలు చెల్లించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాన్ని చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే సతీమణి పూజలు
ఆలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అదే విధంగా మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండ్ల రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, చైర్మన్ ఆలయ విశిష్టతలను వివరించి శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment