ఏళ్లుగా తప్పని నిరీక్షణ
రేషన్‌కార్డుల కోసం
నిరుపేదల ఎదురుచూపులు
● కార్డు లేకపోవడంతో
సంక్షేమ పథకాలకు దూరం
● పేర్ల మార్పు చేర్పులకూ తప్పని తిప్పలు
మానవపాడు: కేవలం బియ్యం పొందడానికే కాకుండా ఇతర ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ముందుగా అడిగేది రేషన్‌కార్డు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన రేషన్‌కార్డు కార్డులను కొన్నేళ్లుగా ప్రభుత్వాలు అందించపోవడంతో వేల సంఖ్యలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో కొత్త రేషన్ కార్డులపై నిరుపేద కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వం అందించే పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు తప్పనిసరిగా రేష్‌న్‌కార్డుల కలిగి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్న ఆలోచనలతో కొత్త రేషన్‌కార్డులు పొందటానికి లబ్ధిదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ, ఏళ్లుగా కొత్త రేష్‌కార్డులు దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులు మాత్రమే మిగిలాయి. ఏడేళ్లుగా కొత్త రేషన్‌కార్డులతో పాటు కార్డుల్లో పేరు చేర్చే ప్రక్రియ చేపట్టకపోవడంతో అనేక మంది పేద ప్రజలు సంక్షేమ పథథకాలకు దూరమవుతున్నారు. మరోవైపు ఐదారేళ్ల క్రితం పుట్టిన పిల్లలతోపాటు అకారణంగా తొలగిస్తూ వస్తున్న అనేక మంది పేదల పేర్లు కార్డుల్లో చేర్చకపోవడంతో వారికి ప్రభుత్వాలు అందించే రాయితీ బియ్యం అందడం లేదు. కొత్త రేషన్‌కార్డులతో పాటు జిల్లాలో ఇప్పటి వరకు దరకాస్తు చేసుకున్న వేలాది మందికి రేష్‌కార్డులు మంజూరు కాలేదు.
పేర్ల మార్పు, చేర్పులకు ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా 1,60,099 రేషన్‌కార్డులు ఉన్నాయి. అందులో అంత్యోదయకార్డులు 10,234, తెల్లరేషన్‌కార్డులు 1,49,739, అన్నపూర్ణకార్డులు 126 ఉన్నాయి. అయితే, 2016 నుంచి ఆయా మండలాల వారీగా కొత్త రేషన్‌కార్డుల కోసం లబ్ధిదారులు వేలాది సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రేష్‌కార్డుల్లో పేర్లు తొలగించే ప్రక్రియ వెంటనే జరుగుతుండగా.. పేరు చేర్చే ప్రక్రియ మాత్రం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అనేకమంది పేర్లు తొలగించుకునేందుకు ముందుకు రావడం లేదు. 2016 నుంచి జిల్లా వ్యాప్తంగా అనేక వేలదిమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా చేపడుతున్న ఈ కేవైసీలు రేషన్‌కార్డుల దారులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రేషన్‌కార్డు లేనివారు ఆయుష్మాన్ భారత్‌కు దూరమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రేషన్‌కార్డులు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలిలా..
ఆరేళ్ల క్రితం దరఖాస్తు చేశా..
2017లో నాకు పెళ్లి కాగా.. కొత్త రేషన్‌కార్డు కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకు కొత్త రేషన్‌కార్డు రాలేదు. మూడు సార్లు రేషన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా లాభం లేకుండా పోయింది. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీలో నిర్లక్ష్యం వహించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా త్వరగా రేషన్‌కార్డుల అందించాలి.
– బి.పావని పైపాడు గ్రామం, వడ్డెపల్లి మండలం
అర్హులకు అందించాలి
నాకు వివాహమై ఐదేళ్లు కావస్తుంది. ఇప్పటీకి కొత్త రేషన్‌కార్డు రాలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డులు అందించాలి. ఎంతోమంది పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగించారు. పుట్టిన పిల్లలను రేషన్‌కార్డుల్లో చేర్చడం లేదు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యం కోల్పోతున్నాం. సంక్షేమ పథకాలు అందుకోలేకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్‌కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– వెంకటేష్ చెన్నిపాడు లబ్ధిదారుడు
ఉత్తర్వులు రాలేదు
కొత్త రేషన్‌కార్డుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. అనుమతులు వస్తే వెంటనే ఆయా గ్రామాల వారీగా లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందిస్తాం. – స్వామికుమార్,
డీసీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment