వినోదం.. కారాదు విషాదం
నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న యువత
● వాహనాలతో మైనర్ల చక్కర్లు.. అతివేగంతో పొంచి ఉన్న ముప్పు
● తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త
గద్వాలటౌన్ : ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన 2024కు వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరం 2025కు స్వాతగం పలుకుతూ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఇప్పటికే యువత కొత్త సంవత్సరానికి పలికేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు. సరదాలూ.. సంబరాలు ఉండాల్సిందే. అది శృతి మించితేనే సమస్య. నూతన సంవత్సరం వేళనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినోదం శృతిమించి విషాదాన్ని మిగిల్చిన సంఘటనలు చాలా ఉండగా.. ఈ ఏడాదైనా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచన చేస్తున్నారు.
సంబరాలు చేసుకోండి.. కానీ
జిల్లాలో ప్రతిఏటా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. కొందరిని విషాదంలో నింపుతూనే ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. మన ఉత్సాహం, మన ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. అది లేనిపోని సమస్యలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఇటువంటి అనుకోని విషాదాలను అరికట్టి నూతన సంవత్సర వేడుకలను ఇంట్లోనే ఉత్సాహంగా జరుపుకొందాం.
Comments
Please login to add a commentAdd a comment