¢ నూతన సంవత్సర వేడుకల్లో సందడంతా విద్యార్థులూ, యువతదే... పోలీసు ఆంక్షలు, నిబంధనలను పాటిస్తూ వేడుకలను తమ నివాసంలో తల్లిదండ్రులు, బంధువుల మధ్య నిర్వహించుకోవడం ఉత్తమం.
¢ ఎంత సందడి చేసినా అది ఇతరులకు ఇబ్బందికరంగా మారకూడదు. రోడ్లపై వెళ్తున్న పరిచయం లేనివారిని నిలువరించడం, వారి చుట్టూ గుమిగూడి హడావుడి చేయడం మంచిది కాదు.
¢ నూతన సంవత్సరం ఆగమనం వేళ బైకులూ, అందులోనూ హైస్పీడ్ బైకులకు దూరంగా ఉండాలి. అర్ధరాత్రి వేళ రద్దీగా ఉండే రోడ్లపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. ఇతరులను భయబ్రాంతులకు గురిచేయొద్దు. మద్యానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం.
¢ గత నాటుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. గతంలో ఈ కేసుల్లో పట్టుబడిన కేవలం జరిమానాలే విధించేవి. 31వ తేదీ రాత్రి ఏమాత్రం తేడా జరిగినా కేసులు నమోదు కావడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ విషయాన్ని గుర్తించాలి.
¢ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. రద్దీ ప్రాంతాలు, ప్రార్థన మందిరాల దగ్గర పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఉత్సవాల వేళ అపశ్రుతులు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉంది. ఈమేరకు ఇప్పటికే ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment