శాంతిభద్రతలపై నిరంతరం అప్రమత్తత
గద్వాల క్రైం: శాంతిభద్రతలపై సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఐజీ కె.రమేష్ నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద నిత్యం నిఘా ఉంచాలని, చట్ట వ్యతిరేక దందాలను ఎంత మాత్రం ఉపేక్షించవద్దని, ప్రతి స్టేషన్‌లో రికార్డులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. సైబర్, ట్రాఫిక్, ఐటీ, ఎస్‌బి, టాస్క్‌ఫోర్స్, నిఘా తదితర విభాగాల పని తీరుపై నివేదికలను పరిశీలించారు. పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ సత్యానారయణ, సీఐలు టాటా బాబు, శ్రీను, నాగేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment