గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి
గద్వాలటౌన్: గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని.. బంజారాల అభ్యున్నతికి కలిసికట్టుగా ముందడుగు వేయాలని ఆలిండియా బంజార సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని మాట్లాడారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్య మూర్తి సంత్ సేవాలాల్ అని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనలతో బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశారని అనానరు. లంబాడీ ప్రజలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య పరంగా, రాజకీయంగా చైతన్యం సాధించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కిసాన్‌సింగ్, రాందాస్‌నాయక్, శేఖర్‌నాయక్, తాన్యనాయక్, శివనాయక్, రాము, హనుమంతు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment