జోగుళాంబ సన్నిధిలో ఐజీ, డీఐజీ
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ పుణ్య క్షేత్రాన్ని ఐజీ సత్యనారాయణ, డీఐజీ చౌహాన్ సోమవారం దర్శించున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జోగుళాంబ అమ్మవారికి, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈఓ పురేందర్‌కుమార్ తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు.
ఆదిశిలా క్షేత్రంలో
అమావాస్య ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రాలేని భక్తులు సోమవారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయానికి పెద్దసంఖ్యలో హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే భక్తులు కొత్త, పాత వాహనాలకు అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తమార్కేండేయ హరికథను ఆలయ ప్రాంగణంలో ఆంజనేయులు భాగవతార్ భక్తులకు వినిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, మధుసూధనాచారి, రవిచారి, దీరేంద్రదాసు, నాగరాజు శర్మ, చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం
అందించండి
అలంపూర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ మందా జగన్నాథంకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఎంపీ చికిత్స పొందుతుండగా.. సోమవారం మంత్రులతోపాటు ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.
‘పాలమూరు’
ఎత్తిపోతలపై కుట్రలు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి డిండి ప్రాజెక్ట్ ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 159ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా పాలమూరు ప్రాజెక్ట్‌లోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తే పాలమూరు జిల్లాలోని కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీరు అందని పరిస్థితి తలెత్తనుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి త్వరగా ఇక్కడి రిజర్వాయర్లను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి నుంచి నీటిని తరలిస్తే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాలమూరు ప్రజల సాగునీటి ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment