న్యూ ఇయర్‌ వేడుకల్లో తెగ తాగేశారు | - | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ వేడుకల్లో తెగ తాగేశారు

Published Thu, Jan 2 2025 1:39 AM | Last Updated on Thu, Jan 2 2025 1:39 AM

-

నాలుగు రోజుల్లో

రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలో

మద్యం ప్రియుల రికార్డు

వ్యాపారులు, ఆబ్కారీశాఖకు

కాసుల పంట

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన

207 మంది వాహనదారులు

మహబూబ్‌నగర్‌ క్రైం: మందుబాబులు.. తెగ తాగేశారు. ఎకై ్సజ్‌శాఖకు మాంచి కిక్కిచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. మందుతో పాటు మాంసం, కేక్‌లు, బిర్యానీలు ఇలా అన్ని రకాల వ్యాపారం దాదాపు రూ.వంద కోట్ల వరకు జరిగింది. ప్రధానంగా డిసెంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 31 వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్‌ లిక్కర్‌ విక్రయాలున్నాయి. మందు బాబులు పెగ్గుమీద పెగ్గు లాగించి.. కిక్కులో మునిగి తేలారు. న్యూ ఇయర్‌ వేడుకలు ఉన్న నేపథ్యంలో వ్యాపారులు మద్యం డిపో నుంచి అధికంగా మందు తీసుకొచ్చి నిల్వ చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు కొనసాగడంతో వ్యాపారులు, ఆబ్కారీశాఖకు కాసుల పంట పండింది. గతేడాది కంటే ఈసారి ఐఎంఎల్‌ 10 శాతం విక్రయాలు పెరగడంతో.. మద్యం ప్రియులు రికార్డు సృష్టించారు.

● పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో బార్లు, మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్‌లకు అనుమతి ఉండటం వల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 90, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 67, వనపర్తిలో 37, గద్వాలలో 36 మద్యం దుకాణాలున్నాయి. కాగా.. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌ మొదటి స్థానంలో ఉండగా.. జడ్చర్లలో రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, కొత్తకోట ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.

గద్వాలలో డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు (ఫైల్‌)

నడిగడ్డలో రూ.3.10 కోట్ల మద్యం అమ్మకాలు

గద్వాల క్రైం: న్యూ ఇయర్‌ వేడుకలకు మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లాలోని మద్యం దుకాణాలు, రెస్టారెంట్‌ల వద్ద మద్యం ప్రీయుల తాకిడికి మందు పెట్టెలు ఖాళీ అయ్యాయి. జిల్లాలో డిసెంబర్‌ 30, 31వ తేదీల్లో రూ. 3.10 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎకై ్సజ్‌ సీఐ గణపతి రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరిగాయన్నారు. ఎకై ్సజ్‌శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement