పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు
ధరూరు : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలచ ఆవరణలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని, సీఎం, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఇందిరమ్మ మోడల్ నిర్మాణానికి భూమి పూజలు చేయాలని వచ్చిన ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించి పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామన్నారు. రూ.5 లక్షలతో ఒక బెడ్ రూం, కిచెన్, హాల్ వంటి విధంగా ఇంటి నిర్మాణ చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్, కురుమన్న, వేణుగోపాల్, పద్మావెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో
అందరూ భాగస్వాములు కావాలి.
గట్టు : గ్రామాల్లో నిర్వహించే జాతరలు గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని గ్రామస్తులంతా ఉత్సవాలను కలిసిమెలిసి జరుపుకొంటున్నట్లుగానే గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలూరు గ్రామంలో నిర్వహించిన ఆంజనేయస్వామి రథోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామి వారి రథోత్సవానికి పూజలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ ఆనంద్‌గౌడ్, మాజీ సర్పంచు నర్సన్‌గౌడ్, నాయకులు రాముశెట్టి, తిమ్మప్ప, చంద్రశేఖర్,మహేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment