ఆదిశిలాక్షేత్రం హుండీ ఆదాయం రూ.25,62,300
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూగా వెలసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ.25,62,300 ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా.. గద్వాల ఎస్‌వీఎస్ సేవా సంఘం నిర్వాహకుడు అభిలాష్, ఆధ్వర్యంలో 120 మంది మహిళలు, గట్టుకు చెందిన శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం రూ.25,62,300 ఆదాయం సమకూరగా చింతలాముని నల్లారెడ్డిస్వామి హుండీ ఆదాయం రూ.1,32,406 వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.1,55,171 అదనంగా ఆదాయం సమకూరిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, చైర్మన్ ప్రహ్లాదరావు, అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబురావు, మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, నరేందర్, నారాయణ, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment