వైభవంగా లక్ష్మీహయగ్రీవస్వామి ఉత్సవాలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీహయగ్రీవ స్వామి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యహవచణం, శ్రీలక్ష్మీహయగ్రీవ స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి రక్షాబంధన కార్యక్రమాలు అర్చకులు వేదమంత్రాల మధ్య జరిపారు. అదేవిధంగా యాగశాలలో వాస్తు ఆరాధనలు, వాస్తు హోమాలు, వాస్తు పర్యగ్నికరణం వంటి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు సురేందర్‌రాజు, అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment