నిరాశాజనకం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశజనకంగా ఉంది. ప్రధానంగా మధ్యతరగతి వాసులకు ఎంతమాత్రం ఆమోద యోగ్యంగా లేదు. కేవలం అంకెల గారడీ చేశారు తప్పితే ఏ ఒక్క వర్గానికి ప్రజయోజనకరంగా లేదు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ లేకపోవడం గర్హనీయం.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గద్వాల
మొండిచేయి..
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు మొండి చేయి మిగిల్చింది. బడ్జెట్‌లో పేదల గురించి పట్టించుకోలేదు. సామాన్యులను పూర్తిగా విస్మరించింది. జిల్లాలో రైల్వేకు సంబంధించి నిధులు కేటాయింపులు ఉంటాయని ఎంతో ఆశించినా నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రం గురించి ఆలోచించలేదు. జిల్లాకు నిధులు కేటాయిస్తుందని ఆశించడం బీజేపీ హయాంలో అత్యశే అవుతోంది. పేదలను విస్మరించి అంకెల గారడీ చేశారు.
– విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్
Comments
Please login to add a commentAdd a comment