గొప్ప విషయం..
కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రూ.12 లక్షలకు పెంచడం గొప్ప విషయం. మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకం, మౌళిక రంగం, సుస్థిర అభివృద్ధి, స్టార్టప్స్, మీడియం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రోత్సాహకం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. వ్యవసాయం, పేద, మధ్య తరగతి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
– గడ్డం జిమ్మీకార్టన్, హెచ్‌ఓడీ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్, పీయూ
అద్భుతమైన బడ్జెట్..
ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షించే అద్భుతమైన బడ్జెట్. మధ్యతరగతి వేతన జీవులకు రూ.12లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు చేయడం, రైతులు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు కిసాన్‌క్రెడిట్ కార్డు పెంచడం, ఎంఎస్‌ఎంఈలకు రూ.20కోట్ల వరకు టర్మ్ దరుణాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు 2.0 ద్వారా రూ.8కోట్ల మంది చిన్నారులకు పోషకహారం అందించడం హర్షనీయం. – ఎస్.రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment