చేపల వలకు చిక్కిన భారీ మొసలి
ఎర్రవల్లి: చేపలు పట్టేందుకు మత్స్యకారులు వేసిన వలకు భారీ మొసలి చిక్కిన ఘటన మండలంలోని కొండేరులో శనివారం చోటు చేసుకుంది. మత్స్యకారులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొండేరు లచ్చమ్మ చెరువులో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వలను వేయగా చేపలతోపాటుగా భారీ మొసలి వలకు చిక్కింది. మొదట దీనిని చూసిన మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చాకచక్యంతో చెరువు నుంచి ఒడ్డుకు తీసుకువచ్చి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు చేరుకొని బొలేరో వాహనంలో బీచుపల్లికి తరలించి మొసలిని నదిలో వదిలారు. ఇదిలాఉండగా, ఈ భారీ మొసలిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment