వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్
గద్వాలన్యూటౌన్: వ్యవసాయ రంగాన్ని కాంగ్రేస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం గద్వాలలోని జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులను వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తూ అన్నదాతల మనోధైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. గడిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వారిని విస్మరిస్తూ కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. గడిచిన 423 రోజుల్లో 412 మంది పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులకు నీరు అందించేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రైతుభరోసాలోనూ కోతలు పెడుతున్నారని దుయ్యబడ్డారు. పలు పథకాల అమలులో కాలయాపన తప్ప చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment