గద్వాల మార్కెట్ యార్డును మాజీమంత్రి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. యార్డుకు రైతులు తీసుకొచ్చిన వేరుశనగను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడారు. పంటకు అయిన పెట్టుబడి, వస్తున్న ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు రాక వేరుశనగ రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారన్నారు. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.6783 ఉండగా ఆ ధర ఇక్కడి యార్డులో రైతులకు అందడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మద్దతు ధర కన్నా ఎక్కువ ధరలు ఇచ్చి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. కార్యక్ర మాల్లో పార్టీ సీనియర్ నాయకులు బాసు హనుమంతు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పటేల్ విస్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు జనార్ధన్‌రెడ్డి, మోనేష్, శేఖర్ నాయుడు, గంజిపేటరాజు, శ్రీరాములు,పల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment