పరీక్షలకు వేళాయె..
జిల్లా కేంద్రం నుంచి
నేరుగా పర్యవేక్షణ
పరీక్షల నిర్వహణకు ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలు బిగించి ఐపీ అడ్రస్ నమోదు చేసినందున జిల్లాలోని వివిధ కళాశాలల్లో నిర్వహించే ప్రయోగ పరీక్షలను జిల్లా ఇంటర్ విద్యాధికారితో పాటు ఇంటర్ బోర్డు అధికారులు నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రతీసారి స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించాల్సిన అవసరం లేదు. మరో వైపు పరీక్ష కేంద్రాలపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీసీ కెమెరాల ద్వారా డిజిటల్ వీడియో రికార్డర్‌లో మొత్తం రికార్డు కానుండటంతో పరిశీలించడం సులువు కానుంది.
వెంటనే మార్కుల నమోదు
ప్రయోగ పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకనం చేసిన మార్కులను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అప్పటికప్పుడు నమోదు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగ పరీక్షల నిర్వహణకు కావాల్సిన ప్రశ్నపత్రాలు కూడా పరీక్ష సమయానికి ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే వెసులుబాటు కలగనుంది.
● సీసీ కెమెరాలున్న జూనియర్ కళాశాలలకే కేంద్రాలు
● జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు.. 3,677 మంది విద్యార్థులు
గద్వాలటౌన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలు (ఫిబ్రవరి 3 నుంచి) పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు నడుం బిగించింది. కళాశాలల్లో అన్ని వసతులు ఉండి సీసీ కెమెరాలు బిగించుకున్న వాటికే పరీక్ష కేంద్రాలుగా అనుమతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 43 జూనియర్ కళాశాలలు ఉండగా... అన్ని రకాల వసతులు ఉండి సీసీ కెమెరాలు బిగించుకున్న కళాశాలలకే పరీక్ష కేంద్రాలను మంజూరు చేశారు. 50 మంది కన్నా తక్కువ ఉన్న కళాశాలల విద్యార్థులకు సమీపంలో ఉన్న కళాశాలలకు మార్చారు. మొత్తం 3,677 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా 34 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఆయా కళాశాలల్లో సీసీ కెమెరాలతో పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సైన్స్ గ్రూపుల్లో ఎంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రాలు... బైపీసీ విద్యార్థులు బౌతిక, రసాయనంతోపాటు జంతు, వృక్ష శాస్త్రాల్లో ప్రయోగాలు చేయించాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు 30 మార్కులకు అవకాశముంది. థియరీ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకూ ప్రయోగ పరీక్షల్లో 30కి 30 మార్కులు వచ్చిన సందర్భాలనేకం. గ్రామీణ స్థాయి కళాశాల నుంచి కార్పొరేటు కళాశాలల వరకు థియరీ పరీక్షలకు ఉన్న ప్రాధాన్యం ప్రయోగ పరీక్షలకు ఉండేది కాదు. ఈ కారణంగా అధ్యాపకులు సైతం నామమాత్రంగా నిర్వహించి పరీక్షలు ముగించే వారు. ఇంటర్ బోర్డు నిర్ణయంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే మేల్కొన్నారు. విద్యార్థులను థియరీ పరీక్షలకు సన్నద్ధం చేసిన మాదిరిగానే ప్రయోగాలు చేయించి పరీక్షలు నిర్వహిస్తుండటం విశేషం.
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment