క్రీడా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు
గద్వాలటౌన్: ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీని వల్లే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్ సంతోష్ అభిప్రాయపడ్డారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన షేర్‌అలీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నీకి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలనే తలంపుతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీలను లక్ష్యంగా నిర్దేశించుకొని ఆడాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని సూచించారు. ప్రతిభ కలిగిన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, అప్పుడే ఏ క్రీడలనైనా రాణించవచ్చన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతోపాటు, మానసిక దృఢత్వం లభిస్తుందని చెప్పారు. క్రీడలలో రాణించే వారిని దేశ హీరోలుగా కొలుస్తారన్నారు. క్రీడలు ఔన్నత్యాన్ని చాటుతాయని చెప్పారు. అనంతరం ట్రోఫీని ఆవిష్కరించారు. తహసీల్దార్ మల్లికార్జున్, డీవైఎస్‌ఓ జితేందర్, భీంసేన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment