అన్ని ఏర్పాట్లు పూర్తి
నాలుగు విడతలుగా జరిగే ప్రయోగ పరీక్షలకు జిల్లా పరిధిలోని అన్ని కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ బోర్డు నిర్ణయం మేరకు సీసీ కెమెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా అవకతవకులను నిరోధించి ప్రయోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే వెసులుబాటు ఉంది. ఫలితంగా ప్రతిభ ఉన్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. బోర్డు ద్వారా నియమితులైన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల ద్వారా పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలి. – హృదయరాజు, డీఐఈఓ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment