![భోజనం నాణ్యతగా లేకుంటే చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07gdl353-210035_mr-1738954845-0.jpg.webp?itok=i_cQX9Sq)
భోజనం నాణ్యతగా లేకుంటే చర్యలు
ధరూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. నాణ్యతలో రాజీపడితే చర్యలు తప్పవని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద ఉన్న గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, టీచర్లు పాఠాలు బాగానే చెబుతున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈక్రమంలో పలువురు విద్యార్థులు భోజనం నాణ్యతగా ఉండడం లేదని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత వంట కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత హాజరు వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రాత్రి గురుకులంలోనే కలెక్టర్ బస చేశారు.
గురుకుల పాఠశాలలో
కలెక్టర్ ఆకస్మిక
తనిఖీ.. రాత్రి బస
Comments
Please login to add a commentAdd a comment