![‘సీఎంఆర్’ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07gdl176-210147_mr-1738954846-0.jpg.webp?itok=7Z86bUOO)
‘సీఎంఆర్’ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి
గద్వాల: సీఎంఆర్ (కస్టమ్ మిల్లిడ్ రైస్) డెలివరీగా త్వరగా అయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మిల్లర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వానాకాలం 2024–25 ధాన్యం డెలివరీపై 37 మంది రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి రైసు మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. సీఎంఆర్ సమయానికి సరఫరా చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే ఆహార భద్రతలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు. సన్న బియాన్ని సమర్ధవంతంగా డెలివరీ చేయాలని సూచించారు. ఖరీఫ్ 2024–25 పంటకు సంబందించి ఇప్పటివరకు ఇవ్వని బ్యాంక్ గ్యారెంటీలను త్వరగా ఇవ్వాలన్నారు. రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ స్వామి కుమార్, జిల్లా మేనేజర్ విమల, మిల్లర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment