రెండు నెలల పాటు భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు | Sakshi
Sakshi News home page

రెండు నెలల పాటు భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు

Published Sat, Apr 20 2024 3:20 AM

విలేకరులతో మాట్లాడుతున్న                                       ఈఓ తారకేశ్వరరావు  - Sakshi

ఈఓ తారకేశ్వరరావు

రామచంద్రపురం రూరల్‌: త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్‌ 30 వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబా అమ్మవార్ల గర్భాలయాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి అందజేసిన నర్మద బాణ లింగానికి, శ్రీ చక్ర యంత్రానికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకాలు, కుంకుమార్చనలు ఉదయం 10 గంటలకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు స్వామి, అమ్మవార్లకు ప్రతి నిత్యం ఆర్జిత సేవలు, నిత్య కై ంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement