వైఎస్సార్ సీపీ సర్పంచ్‌పై జనసేన నాయకుల దాడి
కాకినాడ రూరల్: మహాత్మా గాంధీ జయంతి రోజు మత్స్యకార గ్రామమైన సూర్యారావుపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన మహిళా సర్పంచ్‌పై దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న జనసేన పార్టీకి చెందిన ఆ గ్రామ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పంచాయతీలోని డంపింగ్ యార్డు వద్ద గాంధీ జయంతి నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే గాంధీ విగ్రహానికి ఫొటోకాల్‌కు విరుద్ధంగా కొందరు జనసేన నాయకులు దందలు వేయబోయారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ చిన్ని, ఆమె భర్త రాజు ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి వెంకటరత్నాన్ని ప్రశ్నించారు. దీంతో ఫొటోకాల్ ప్రకారం సర్పంచ్‌తో ఆయన దండ వేయించారు. అనంతరం మధ్యాహ్నం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సర్పంచ్‌పై జనసేన నాయకులు దాడికి పాల్పడి, బూతులు తిట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్ని, ఎంపీటీసీ రాజేశ్వరి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనపై రాజేశ్వరి తదితరులు దాడి చేయడంతో గాయాలతో ఆస్పత్రిలో చేరినట్టు సర్పంచ్ చిన్ని తెలిపారు. ఎంఎల్‌సీ అనంతరం తిమ్మాపురం పోలీసు స్టేషన్‌లో ఏడుగురిపై ఫిర్యాదు చేసినన్నారు. దీనిపై ఎస్సై రవీంద్రబాబును వివరణ కోరగా సర్పంచ్ చిన్ని ఫిర్యాదుపై రాజేశ్వరి తదితరులు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఎంపీటీసీ రాజేశ్వరి ఫిర్యాదు మేరకు సర్పంచ్ తదితరులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇరు వర్గాలు ఘర్షణ పడినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment