రూ.5.86 లక్షల విలువైన ఆయిల్ సీజ్
మామిడికుదురు: అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్‌ను విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా పాశర్లపూడిలంకకు చెందిన రాచకొండ వెంకటేశ్వరరావు అలియాస్ ఆయిల్ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 47 పీపాల్లో నిల్వ చేసిన రూ.5.86 లక్షల విలువైన 9,400 లీటర్ల సాల్వెంట్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎస్‌ఓ దేవళ్ల శ్రీనివాస్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. తీగ లాగితే డొంక కదిలిన తరహాలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. రావులపాలెంలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆయిల్ శ్రీను వ్యవహారం వెలుగు చూసింది. సఖనేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద నిందితుడికి ఉన్న బయో డీజిల్ బంకుకు చెందిన బిల్లు రావులపాలెం కేసులో బయటపడింది. దాని ఆధారంగా మంగళవారం విజిలెన్స్, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం వరకు ఏకదాటిగా చేసిన విచారణలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆయిల్ వ్యవహారం వెలుగుచూసింది. 55 ఖాళీ పీపాలను కూడా స్వాధీనం చేసుకుని, పాశర్లపూడి పెట్రోల్ బంకు యజమానికి అప్పగించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్య కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment