కనకదుర్గమ్మకు వెండి కిరీటం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

కనకదుర్గమ్మకు వెండి కిరీటం సమర్పణ

Published Fri, Oct 18 2024 3:06 AM | Last Updated on Fri, Oct 18 2024 3:06 AM

కనకదు

మధురపూడి: మండలం దోసకాయలపల్లి దేవితల్లి సెంటర్‌లోని కనకదుర్గమ్మ వారికి రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వెంకటనగరానికి చెందిన ఉప్పులూరి సత్యనారాయణ చౌదరి రెండున్నర కిలోల వెండి కిరీటాన్ని సమర్పించారు. సుమారు రూ.2.5 లక్షల విలువైన కిరీటాన్ని ఆయన ఆలయ ధర్మకర్త, జెడ్పీటీసీ కర్రి నాగేశ్వర రావుకు అందజేశారు. అనంతరం అమ్మవారికి కిరీటాన్ని అలంకరించారు.

రూ.1.5 లక్షలు పలికిన

సౌభాగ్య దుర్గాంబిక విగ్రహం

దేవరపల్లి: శరన్నవరాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా సౌభాగ్య దుర్గాంబిక ఉత్సవ విగ్రహం ఊరేగింపునకు బుధవారం రాత్రి స్థానిక మూడు బొమ్మల సెంటర్‌లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. పోటీదారుల మధ్య పాట హోరాహోరీగా సాగింది. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకూ సాగిన పాటలో పంచాయతీ సభ్యుడు తంగెళ్ల సుబ్రహ్మణ్యం, అడబాల రామాంజనేయులు చివరి వరకు పోటీ పడ్డారు. చివరకు రూ.1.5 లక్షలకు తంగెళ్ల సుబ్రహ్మణ్యం అమ్మవారి విగ్రహాన్ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.1.85 లక్షలు పలికినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాట దారులు ఊరేగించి జలపాతంలో నిమజ్జనం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కనకదుర్గమ్మకు  వెండి కిరీటం సమర్పణ 1
1/1

కనకదుర్గమ్మకు వెండి కిరీటం సమర్పణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement