బొలెరో వాహనం దగ్ధం
ఆలమూరు: ఆలమూరు – మండపేట రోడ్డులో మంగళవారం బొలెరో వాహనం దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓఎన్‌జీసీ మండపేట కేజీ బేసిన్‌కు చెందిన బొలెరో వ్యాన్ స్థానిక దేవీ థియేటర్ వద్దకు వచ్చేసరికి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దానిలోని డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. అంతలోనే వ్యాన్ క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. దట్టమైన పొగతో కూడిన మంటలు రావడంతో వాహనచోదకులు భయాందోళన చెందారు. ఘటనా స్థలానికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్.విద్యాసాగర్, ఎస్సై ఎం.అశోక్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మండపేట అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి స్కేటింగ్ క్రీడాకారుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 9 వరకూ అంతర్ జిల్లాల స్కేటింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి దొరస్వామి మంగళవారం తెలిపారు. స్థానిక వైఎస్‌ఆర్ మున్సిపల్ స్కేటింగ్ రింక్‌లో బుధ, గురువారాల్లో రింక్ విభాగంలో, 8, 9 తేదీలలో రోడ్ విభాగంలో నిర్వహిస్తామన్నారు. వీటికి సుమారు 600 మంది క్రీడాకారులు హాజరవుతారన్నారు.
7, 8 తేదీలలోజిమ్నాస్టిక్స్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీలలో ఎస్‌జీఎఫ్‌ఐ 66వ అంతర్ జిల్లాల జిమ్నాస్టిక్స్ పోటీలను కాకినాడలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎల్.జార్జి మంగళవారం విలేకరులకు తెలిపారు. కాకినాడ డీఎస్‌ఏ జిమ్నాజియంలో జరిగే ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు, 50 మంది క్రీడాధికారులు, కోచ్‌లు, మేనేజర్లు హాజరవుతారన్నారు. అండర్–14, 17, 19 బాలుర, బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ ప్రారంభిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment