పని ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదం
కాకినాడ రూరల్: పని ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. రమణయ్యపేటలో కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఎస్పీతో పాటు కలెక్టర్ షణ్మోహన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారికి కమాండెంట్ దీపిక, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. సిబ్బందిలో జోష్ నింపేందుకు ఐపీఎస్ అధికారులైన భార్యాభర్తలు టగ్ ఆఫ్ వార్‌లో తలపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. బెటాలియన్‌లోని ఏడు కంపెనీలు మూడు రోజులుగా జరిగిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఓవర్ చాంపియన్‌గా ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం టీమ్ నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులకు పోటీతత్వం ఉండాలని, వయసుతో పనిలేదన్నారు. కమాండెంట్ దీపిక మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని, దాన్ని తగ్గించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. అనంతరం ఏపీఎస్పీ స్కూల్ విద్యార్థులు, నటరాజన్ సుబ్రహ్మణ్యం అకాడమీ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. బెటాలియన్ సిబ్బంది ఆర్కెస్ట్రాతో ఉల్లాసం నింపగా, చివరగా క్యాంప్ ఫైర్ వెలిగించారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఏపీఎస్పీలో ముగిసిన
గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్
Comments
Please login to add a commentAdd a comment