జనసేన ఇన్‌చార్జికి చేదు అనుభవం
కొత్తపల్లి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రతినిధిగా ఉన్న జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఆందోళన చేస్తున్నా.. ఏనాడైనా గ్రామంలోకి వచ్చారా అంటూ ఆయనను యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ శివారు కోనపాపపేటలో స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కొంతసేపు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అల్పపీడనం ప్రభావంతో సముద్ర కోతకు గురైన కోనపాపపేట తీర ప్రాంతాన్ని పరిశీలించేందుకు గురువారం శ్రీనివాస్ ఆ గ్రామానికి వచ్చారు. తీరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను పైపులైన్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేయడంతో మత్స్య సంపద అంతరించిపోతోందని, మత్స్యకారులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య సంపద అంతరించిపోతే మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. పరిశ్రమలకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేస్తున్నా తమ గ్రామం వైపు ఏనాడైనా కన్నెత్తి చూశారా అని శ్రీనివాస్‌ను మత్స్యకారులు నిలదీశారు. ఓట్లు వేయడానికేనా మత్స్యకారులు అని నిలదీశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కోతకు గురవుతున్న తీర ప్రాంతానికి శాశ్వత రక్షణ చర్యలు చేపడతామన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు ఈ విషయాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడంతో శ్రీనివాస్‌ను మత్స్యకారులు విడిచిపెట్టారు.
ఫ కోనపాపపేటలో అడ్డుకున్న మత్స్యకారులు
ఫ సమస్యలపై ఆందోళనలు చేసే
పట్టవా అని నిలదీత
Comments
Please login to add a commentAdd a comment