ప్రసాద్ .. మరింత జాప్యం
అన్నవరం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రారంభించిన పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము పనులు మరింత జాప్యం కానున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత, నాటి ప్రజాప్రతినిధుల చొరవతో అన్నవరం దేవస్థానం గతంలోనే ప్రసాద్ పథకానికి ఎంపికై ంది. ఈ పదేళ్లలో ఎన్నో అవాంతరాలు దాటుకుని, చివరకు సుమారు రూ.20 కోట్లతో రత్నగిరిపై వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
‘ప్రసాద్’తో చేపట్టే పనులివీ..
ఫ ప్రసాద్ నిధులతో అన్నవరం దేవస్థానంలో పలు పనులు చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. ఆ మేరకు గత మార్చి ఏడో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి ఈ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
ఫ దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.10 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం నిర్మించాలని నిర్ణయించారు.
ఫ అలాగే, ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.6 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
ఫ ప్రకాష్ సదన్ భవనం వెనుక ఉన్న ప్రస్తుత పార్కింగ్ స్థలంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ.3 కోట్లతో పురుషులు, మహిళలకు విడిగా టాయిలెట్ల బ్లాక్‌లు నిర్మించాలని నిర్ణయించారు.
ఫ అదే విధంగా సత్రాల వద్ద నుంచి ఆలయానికి, వ్రత మండపాల మధ్య భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా రూ.కోటితో రెండు బ్యాటరీ కార్లు నడపాలని ప్రణాళిక రూపొందించారు.
టెండర్ల రద్దు అందుకేనా!
ఈ పనుల కోసం గత అక్టోబర్ 3న టెండర్లు పిలిచారు. అదే నెల 25న ఈ టెండర్లు తెరచి, ఖరారు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఆ పని జరగలేదు. ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించి, ఫైనాన్షియల్ బిడ్‌లో లోయెష్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికే ఈ టెండర్లు ఖరారు చేయాలి. ఈ టెండర్లలో 12 ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. వీటిల్లో ఒకటి రాష్ట్ర మంత్రికి చెందిన సంస్ధ అని, దానికి ఈ టెండర్లు కట్టబెట్టేందుకే రాష్ట్ర పర్యాటక అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని గతంలో విమర్శలు వచ్చాయి. అయితే, నిధులు విడుదల కాకపోవడమే టెండర్లు తెరవకపోవడానికి ప్రధాన కారణమని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా నిధులు విడుదలయ్యాయని, అయితే గత టెండర్లు కాలపరిమితి ముగిసినందున వాటిని రద్దు చేసి, మళ్లీ పిలవనున్నామని అంటున్నారు.
మళ్లీ పిలుస్తాం
అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ టెండర్లకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ, ఈ నెల 2న ఆదేశాలు జారీ అయ్యాయి. పాత టెండర్లు తెరవడానికి సమయం మించిపోయింది. అందువలన ఉన్నతాధికారులతో చర్చించి, పాతవి రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తాం.
– ఈశ్వరయ్య, ఇన్‌చార్జి సీఈ, పర్యాటక శాఖ
ఫ రత్నగిరిపై నిర్మాణాల టెండర్లు రద్దు
ఫ ఈ నెలలో మరోసారి పిలిచే అవకాశం
ఫ గతంలో దాఖలు చేసిన 12 సంస్థలు
ఫ ఇప్పటి వరకూ తెరవని పర్యాటక శాఖ
ఫ కూటమి మంత్రి సన్నిహితునికి
కట్టబెట్టేందుకే ఆలస్యమంటూ
గతంలోనే విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment