వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు
కాకినాడ: వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామకాలను ప్రకటించింది. వివిధ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్న పలువురిని ఎంపిక చేసి, నూతన కమిటీలను ప్రకటించారు. జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడిగా ఒమ్మి రఘురామ్ (జగ్గంపేట), వలంటీర్ల విభాగం అధ్యక్షుడిగా మేడిశెట్టి రమణ (బుజ్జి) (పెద్దాపురం), జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా లంకా ప్రసాద్ (తుని) నియమితులయ్యారు. జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షునిగా చింతల రాజు (ప్రత్తిపాడు), క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా దడాల జాషువా (కాకినాడ రూరల్), విద్యార్థి విభాగం అధ్యక్షునిగా పూసల అనిల్ (కాకినాడ రూరల్), గ్రీవెన్స్ సెల్ విభాగం అధ్యక్షునిగా తోటకూర శ్రీనివాస్(కాకినాడ రూరల్)లను నియమించారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన ఇల్లి రాజబాబు (బీసీ సెల్), ఎండీ బాషా (మైనార్టీ సెల్), బాదం మధుసూదనరావు(వాణిజ్య విభాగం), ఆదిత్య కుమార్ (లీగల్ సెల్), పేపకాయల కృష్ణప్రియ (సోషల్ మీడియా సెల్), డాక్టర్ మల్లిక్ (డాక్టర్ల సెల్) జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు. అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలిగా వర్ధినీడి సుజాత(పిఠాపురం), దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా వమ్మి గురవయ్య(పిఠాపురం)లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment