సత్యదేవుని ఆలయం కిటకిట
అన్నవరం: రత్నగిరివాసుడు సత్యదేవుని ఆలయానికి సోమవారం భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులతో కలిసి సత్యదేవుని ఆలయానికి వచ్చారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ముత్యాల కవచాల అలంకరణలో
సత్యదేవుడు, అమ్మవారు
సోమవారం పర్వదినం కావడంతో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ)తో అలంకరించి పూజించారు.
Comments
Please login to add a commentAdd a comment