సొసైటీల అభివృద్ధికి చర్యలు
కొత్తపల్లి: సహకార సంఘాల అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సహకార సంఘాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేటర్ ఎస్‌ఎల్‌టీ శ్రీనివాస్ అన్నారు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం సంఘాల సుస్థిర అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల కోసం రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తునట్టు చెప్పారు. సంఘాలు పనితీరును సమీక్షించడానికి క్షేత్రస్ధాయిలో రైతులు, సంఘ సభ్యులు, అధికారులతో మమేకమై వారితో చర్చిస్తామన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో 15 సంఘాలను సందర్శిస్తానని అన్నారు. నాబార్డ్ ద్వారా 70వేల కొత్త బహుళార్థక ప్రయోజనాలు కలిగిన సహకార సంఘాలను దేఽశంలో ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఉందన్నారు. చందుర్తి సంఘం కార్యదర్శి అనుకూల రాంబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment