నెలాఖరుకు పూర్తి చేసుకోవాలి
రైతులు రబీలో వరితో పాటు అపరాలపై దృష్టి సారించాలి. మెట్టలో డిసెంబర్ 31 నాటికి రబీలో వరి నాట్లు పూర్తి చేసుకోవాలి. మార్చి 31 నాటికి వరి సాగు పూర్తి చేసుకుంటే వేసవిలో అపరాలు సాగు చేసుకోవడానికి వీలుంటుంది. రైతులకు వ్యవసాయశాఖ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నాం. జిల్లాలో రబీకి 60 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం 20 వేలు సిద్ధంగా ఉన్నాయి. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలి.
– ఎన్.విజయకుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కాకినాడ
ఎరువులు
అందుబాటులో ఉంచాలి
ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కడానికి రబీలో కూడా వరి సాగునే ఎంచుకున్నాం. ఎకరం పొలం కౌలుకు తీసుకుని సాగు చేపట్టాను. ప్రస్తుతం వరి నాట్లు వేశాం. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి.
– చింతల రామకృష్ణ, రైతు,
గోకవరం మండలం
●
Comments
Please login to add a commentAdd a comment