ట్రాన్స్‌కో కార్యాలయాన్ని పరిశీలించిన సీఎండీ
సామర్లకోట: ట్రాన్స్‌కో సీఎండీ ఐ పృథ్వీతేజ్ మంగళవారం సాయంత్రం స్థానిక సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. విద్యుత్తు పనులకు సంబంధించిన మెటీరియల్ స్టోర్ నిల్వ చేసే ప్రదేశం సామర్లకోట విద్యుత్తు సబ్ స్టేషన్‌లో అనువుగా ఉంటుందని, ఈ మేరకు స్థలం ఉన్నదనే సమాచారం మేరకు ఆయన సబ్ స్టేషన్‌లో స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు మెటీరియల్ బొమ్మూరులో నిల్వ చేయడం వల్ల అనేక ప్రాంతాలకు దూరంగా ఉండటం, కాకినాడ జిల్లాకు సామర్లకోట ముఖ్యకూడలి ప్రదేశంగా ఉంటుందనే అభిప్రాయంతో సబ్ స్టేషన్‌లో స్థలాన్ని పరిశీలించారు. దీనిలో భాగంగా కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అధికారులకు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రసాద్, ఈఈ ఎవీఎన్‌డీఎస్ ప్రభాకర్, డీఈలు శ్రీనివాసు, ఎడీఈ కిరణ్‌కుమార్, ఎఈలు నాగేశ్వరరావు, బి.రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment