సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. క్రిస్మస్ సెలవు దినం కావడంతో వేలాదిగా భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలిరావడంతో స్వామివారి ఆలయం కిటకిటలాడింది. భక్తులంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించగా స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది.
Comments
Please login to add a commentAdd a comment