అల్లవరం: హౌసింగ్ రుణాల పేరుతో ప్రజల నుంచి ఓ టీడీపీ నాయకుడు డబ్బు వసూలు చేసిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కూటమి అధికారంలోకి రావడంతో ఇంటి రుణాలు ఇప్పిస్తామంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేసిన వారు, కొత్తగా నిర్మించుకునే వారికి ఆశ పెడుతున్నారు. ఈ నేప థ్యంలో ఎంట్రుకోన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గెద్దాడ శ్రీను హౌసింగ్ రుణాలు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి రూ. 10 వేలు చొప్పున వసూలుకు పాల్పడుతున్నాడు. ఈ విషయం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు హౌసింగ్ లోన్ ఇప్పిస్తానని గెద్డాడ శ్రీను డబ్బులు తీసుకున్నాడని, తెలియక డబ్బులు ఇచ్చానని వాపోయింది. గ్రామంలో జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడి సారథ్యంలో టీడీపీ అక్రమాలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment