అందరి జీవితాల్లో ఆనందం నిండాలి
కాకినాడ రూరల్: నూతన సంవత్సరం 2025 ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలని, సుఖశాంతులతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు అధికారులకు, వైఎస్సార్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ రమణయ్యపేట వైద్య నగర్‌లోని కార్యాలయంలో కన్నబాబు అభిమానులతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు.
ఎస్సీ కులగణనపై 7 వరకూ అభ్యంతరాల స్వీకరణ
కాకినాడ సిటీ: ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్‌కు సంబంధించి ఈ నెల 7వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణన వివరాలు ప్రదర్శించామన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ అభ్యంతరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారన్నారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 17న కులగణన తుది వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ కులగణన వివరాలపై మూడు దశల్లో తనిఖీలుంటాయన్నారు. పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యాలు, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారని వివరించారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను వీఆర్‌ఓ పరిశీలించి ఆర్‌ఐకి నివేదిస్తారన్నారు. వీటిని ఆర్‌ఐ పునఃపరిశీలించి తహసీల్దార్‌కు నివేదిస్తారని పేర్కొన్నారు. వీఆర్‌ఓ, ఆర్‌ఐల నివేదికలోని వివరాలను తహసీల్దార్ పరిశీలించి తుది ఆమోదం తెలుపుతారన్నారు. దీనిలో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలను ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని, ఈ సోషల్ ఆడిట్‌ను కలెక్టర్, ఆర్‌డీఓలు పర్యవేక్షిస్తారని శ్రీనివాసరావు తెలిపారు.
ఇండియన్ రైఫిల్
షూటింగ్‌కు ఎంపిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 26న భోపాల్‌లో నిర్వహించిన 67వ నేషనల్ రైఫిల్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆదిత్య విద్యార్థిని పి.సాయి తన్మయి ప్రతిభ చూపి, ఇండియన్ రైఫిల్ షూటింగ్ టీమ్ ట్రైల్స్‌కు అర్హత సా ధించింది. ఈ సందర్భంగా ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్ కరుణ మంగళవారం అభినందించా రు. క్రీడలు శారీరక దృఢత్వంలో పాటు ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లకు తోడ్పడతాయని, విద్యార్థి దశ నుంచీ క్రీడల్లో నైపుణ్యం సంపాదించుకోవాల ని సూచించారు. సాయి తన్మయిని వైస్ ప్రిన్సిపా ల్ నాగ శ్రీకాంత్, పీడీ సత్యవతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment