కాకినాడ సిటీ: కాకినాడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన 96 చౌకధరల దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన డీలర్లను నియమించేందుకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్ల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందన్నారు. దరఖాస్తు నమూనాను సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయం లేదా ఆర్డీవో కార్యాలయాల్లో ఆఫీసు పని వేళ్లల్లో పొందవచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలోగాని, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గాని నేరుగాను, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment