అంతర్వేది ఉత్సవాలపై నేడు సమీక్ష
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. దీనిపై గురువారం అంతర్వేదిలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీఓ కె.మాధవి సమక్షంలో సమీక్ష జరగనుంది. ఉత్సవాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులకు ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన ముహూర్త పత్రికను ఆలయ అర్చకులు, వేదపండితులు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ఆలయ ప్రాంగణంలో జరిగే సమావేశానికి తగిన ఏర్పాట్లు బుధవారం పూర్తి చేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 12–55 గంటలకు స్వామివారి కల్యాణం, 8వ తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, 12వ తేదీ పౌర్ణమి స్నానాలు, 13వ తేదీ సాయంత్రం తెప్పోత్సవం ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment